Sree Vishnu: అది నాకే కొత్త అనుభూతినిచ్చింది

‘‘నిజాయితీ గల పోలీస్‌ అధికారుల కథని ఓ బయోపిక్‌లా ‘అల్లూరి’ రూపంలో చూపించాం. మా ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అంతే నిజాయితీగా స్పందన వస్తోంది. నేను ఫైట్లు చేస్తే విజిల్స్‌ వేయడం నాకే కొత్త అనుభూతినిచ్చింది’’ అన్నారు శ్రీవిష్ణు.

Updated : 25 Sep 2022 08:15 IST

‘‘నిజాయితీ గల పోలీస్‌ అధికారుల కథని ఓ బయోపిక్‌లా ‘అల్లూరి’ (Alluri) రూపంలో చూపించాం. మా ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అంతే నిజాయితీగా స్పందన వస్తోంది. నేను ఫైట్లు చేస్తే విజిల్స్‌ వేయడం నాకే కొత్త అనుభూతినిచ్చింది’’ అన్నారు శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయన హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన చిత్రమే ‘అల్లూరి’. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర ద్వితీయార్ధానికి కుటుంబ ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ‘‘నేను అనుకున్న కథ రాశా.. తీశా. విడుదల చేశాం. నా కల నెరవేరింది’’ అన్నారు దర్శకుడు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం శ్రీవిష్ణు కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుంద’’న్నారు. ఈ వేడుకలో రాజ్‌ తోట, హర్ష వర్థన్, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.


వేటగాళ్ల వేట షురూ

సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా మహేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హంట్‌’ (Hunt). గన్స్‌ డోన్ట్‌ లై.. అన్నది ఉపశీర్షిక. వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, భరత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో అర్జున్‌ ప్రసాద్‌ అనే శక్తిమంతమైన పాత్రలో సుధీర్‌ కనిపించనుండగా.. మోహన్‌ భార్గవ్‌గా శ్రీకాంత్, దేవ్‌గా భరత్‌ నటిస్తున్నారు. ప్రచార చిత్రాల్లో ముగ్గురూ స్టైలిష్‌ లుక్స్‌తో కనిపించారు. ఈనెల 28న చిత్ర టీజర్‌ విడుదల చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని