Tollywood: సంక్షిప్త వార్తలు (6)

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా... ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఆనంది కథానాయిక. రాజేష్‌ దండా నిర్మాత. ‘లచ్చిమి...’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని మంగళవారం విడుదల చేశారు.

Updated : 05 Oct 2022 07:37 IST

ఇట్లు.. లచ్చిమి పాట

ల్లరి నరేశ్‌ (Naresh) కథానాయకుడిగా... ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). ఆనంది కథానాయిక. రాజేష్‌ దండా నిర్మాత. ‘లచ్చిమి...’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని మంగళవారం విడుదల చేశారు. శ్రీమణి రచించిన ఈ గీతాన్ని, జావేద్‌ అలీ ఆలపించారు. శ్రీచరణ్‌ పాకాల స్వరకర్త. గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లికి, ఎన్నికల విధుల కోసం వెళ్లిన ఓ ప్రభుత్వాధికారి పాత్రలో నరేశ్‌ కనిపిస్తారు. ఈ చిత్రం నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, సంపత్‌రాజ్‌ తదితరులు నటించారు.


ప్రిన్స్‌ రాక అక్టోబరు 21న  

రుస విజయాలతో దూసుకెళ్తున్న శివకార్తికేయన్‌ (Sivakarthikeyan), ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌ కె.వి. కలయికలతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘ప్రిన్స్‌’ (Prince). మారియా ర్యాబోషప్క కథానాయిక. ఈ చిత్రం అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సినీవర్గాలు మంగళవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో శివకార్తికేయన్‌ హుషారుగా డాన్స్‌ చేస్తూ కనిపించారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, సురేష్‌ ప్రొడక్షన్స్‌, శాంతి టాకీస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


గుండెను కొంగున చుట్టెనా..

శ్‌రాజ్‌, నవమీ గాయక్‌ జంటగా రామకృష్ణార్జున్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అభిరామ్‌’ (Abhiram). శివబాలాజీ, నవీన్‌రెడ్డి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. లెజండరీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జింకా శ్రీనివాసులు నిర్మించారు. ఈ సినిమా నుంచి ఈమధ్యే ‘సైదులో సైదులా ఆ నంగనాచి పిల్లా...’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. యువతరంతోపాటు దీనికి అన్నివర్గాల్లో మంచి స్పందన లభిస్తోందంటూ మంగళవారం సంతోషం వ్యక్తం చేసింది చిత్రబృందం. ఈ పాటకి సాగర్‌ నారాయణ లిరిక్స్‌ అందించగా ఉమా నేహ, సింహాలు ఆలపించారు. మీనాక్షి భుజంగ్‌ స్వరాలందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నట్టు తెలిపారు.


ఈ నెల 28న ‘జెట్టి’

నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జెట్టి’ (Jetty). తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. వర్ధిన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వేణుమాధవ్‌ పిచ్చుక నిర్మిస్తున్నారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడు. చివరిదశ సన్నాహాల్లో ఉన్న ఈ సినిమా ఈనెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. కథానాయిక నందిత శ్వేత మాట్లాడుతూ ‘పల్లెటూరి అమ్మాయిగా నటించాలి అనే కోరిక ఈ చిత్రంతో తీరుతోంది. ఇది ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచుతుంది’ అన్నారు. ‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మించాం. మత్స్యకారుల జీవితాల్లో సమస్యలను చెప్పే చిత్రమిది’ అన్నారు దర్శకుడు. దీనికి సంగీతం కార్తిక్‌ కొడకండ్ల.


డిసెంబరులో.. ‘అన్నీ మంచి శకునములే’

సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan), మాళవికా నాయర్‌ (Malvika Nair) నాయకానాయికలుగా తెరకెక్కుతున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). రాజేంద్రప్రసాద్‌, గౌతమి, వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌, నరేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నందినిరెడ్డి దర్శకురాలు. మిత్రవిందా మూవీస్‌తో కలిసి స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం డిసెంబరు 21 విడుదలవుతున్నట్టు సినీవర్గాలు మంగళవారం ప్రకటించాయి. సంగీతం: మిక్కీ జే మేయర్‌, సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి.


వస్తున్నాడు ‘రారాజు’

శ్‌ (Yash) కథానాయకుడిగా నటించిన ‘రారాజు’ (Raraju) ఈ నెల 14న విడుదలవుతోంది.  పద్మావతి పిక్చర్స్‌ పతాకంపై తెలుగు రాష్ట్రాల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత వి.ఎస్‌.సుబ్బారావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘యశ్‌తోపాటు ఆయన భార్య రాధిక పండిట్‌ జంటగా నటించిన చిత్రమిది. మహేష్‌రావు దర్శకత్వం వహించారు. కన్నడలో ఘన విజయం సాధించింది. తెలుగులోనూ తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిడి గాంధీ, ఘంటాడి కృష్ణ, గురుచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని