Tollywood: ‘777 చార్లీ’ ఎమోషనల్‌ సాంగ్‌ వచ్చేసింది

మూగజీవాలపై జరుగుతున్న హింసను తెలియజేస్తూ తెరకెక్కిన ఎమోషనల్‌ చిత్రం ‘777 చార్లీ’ (777 Charlie). కిరణ్‌ రాజ్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సినీ ప్రియులందరూ ఎమోషనల్‌గా...

Published : 25 Jun 2022 15:35 IST

హైదరాబాద్‌: మూగజీవాలపై జరుగుతున్న హింసను తెలియజేస్తూ తెరకెక్కిన ఎమోషనల్‌ చిత్రం ‘777 చార్లీ’ (777 Charlie). కిరణ్‌ రాజ్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సినీ ప్రియులందరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు. తాజాగా ‘777 చార్లీ’ నుంచి చిత్రబృందం ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది. ‘చార్లీ నువ్వే ఓ అద్భుతం’ అంటూ సాగే ఈపాటలో హీరోకి శునకంతో ఎలాంటి అనుబంధం ఏర్పడిందనేది చూపించారు. రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గుప్తా, రక్షిత్‌శెట్టి సంయుక్తంగా నిర్మించారు. రానా సమర్పణలో ఈసినిమా విడుదలైంది.

ముందుగానే వస్తోన్న లావణ్య

లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ప్రధాన పాత్రలో రితేశ్‌ రానా (Ritesh Rana) దర్శకత్వం వహించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birthday). ఆయుధాల చట్టం కథాంశంతో ఈ సినిమా సిద్ధమైనట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో అర్థమవుతోంది. జులై 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట చిత్రబృందం భావించినప్పటికీ తాజాగా దీన్ని మరింత ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు జులై 8న ‘హ్యాపీ బర్త్‌డే’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. 
మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని