Tollywood: ‘సీతారామం’ లొకేషన్స్‌.. ‘కృష్ణమ్మ’ పాట విన్నారా..!

దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan)‌, మృణాల్‌ ఠాకూర్‌ (Mrinal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ ‘సీతారామం’ (Sita Ramam)....

Published : 19 Aug 2022 17:04 IST

హైదరాబాద్‌: దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan)‌, మృణాల్‌ ఠాకూర్‌ (Mrinal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ ‘సీతారామం’ (Sita Ramam). హను రాఘవపూడి దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ.. విజువలైజేషన్‌, లొకేషన్స్‌ చాలా బాగున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘సీతారామం’ లొకేషన్స్‌ని పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ వీడియో షేర్‌ చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌, శ్రీనగర్‌, కశ్మీర్‌, గుజరాత్‌, హైదరాబాద్‌, రష్యా ప్రాంతాల్లో షూట్‌ చేసినట్లు తెలిపింది. అలాగే, ఆయా ప్రదేశాల్లో షూట్‌ చేసిన సీన్స్‌ క్లిప్స్‌నీ ఈ వీడియో పొందుపరిచింది. ఇక, కృష్ణాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ‘సీతారామం’ నుంచి మరో వీడియో సాంగ్‌ విడుదలైంది. ‘తరలి తరలి మరి రారా ఎదురుగా’ అంటూ సాగే ఈ పాటలో మృణాల్‌ సాంప్రదాయ నృత్యంలో ఆకట్టుకున్నారు.

కృష్ణమ్మ.. పాట

సత్యదేవ్‌ (Satyadev) ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). స్నేహం, ప్రేమ నేపథ్యంలో కొనసాగే రివేంజ్‌ స్టోరీ ఇది. వి.వి.గోపాలకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఓ పాట విడుదలైంది. ‘ఏమవుతుందో మనలో’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయకుడు సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. కాలభైరవ స్వరాలు సమకూర్చారు. మనసుని హత్తుకునే మెలోడిగా రూపుదిద్దుకున్న ఈ పాట యువతను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts