Updated : 11 May 2022 08:22 IST

Cinema News: అవతార్‌ మరో పోరాటం

పండోరా గ్రహం సృష్టికర్త జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో పోరాటానికి రంగం సిద్ధమయింది. తాజాగా విడుదలైన ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ ట్రైలర్‌ గ్లింప్స్‌తో ఆ లోకానికి వెళ్లడానికి ప్రేక్షకులు సిద్ధమయ్యారు. ట్రైలర్‌లో నావీ జాతి యుద్ధ సన్నాహాలు, జేక్‌, నేతిరి మధ్య బంధాన్ని చూపించారు. ఎక్కడికి వెళ్లినా ఈ కుటుంబమే మనకు రక్ష అన్న సంభాషణ ఆకట్టుకుంది. గాల్లో ఎగిరే తోరుక్‌ తరహా భారీ పక్షులు, తిమింగలాల గ్రాఫిక్స్‌ కళ్లు చెదిరేలా ఉన్నాయి. క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబరు 16న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ‘అవతార్‌’ అభిమానులు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్నారు.


నవ్వుల ‘డాన్‌’

కాలేజీ విద్యార్థిగా అల్లరి చేయడానికి యువ కథానాయకుడు శివకార్తికేయన్‌ ‘డాన్‌’గా వస్తున్నాడు. శిబి చక్రవర్తి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటించింది. ఈ చిత్రం మే 13న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ మంగళవారం విడుదల చేశారు. ఇందులో ప్రొఫెసర్లని ఆట పట్టించే విద్యార్థిగా శివకార్తికేయన్‌ నవ్వించాడు. కాలేజీ ప్రిన్సిపాల్‌గా నటించిన ఎస్‌జే సూర్యకు, కథానాయకుడికి మధ్య జరిగే టామ్‌ అండ్‌ జెర్రీ తరహా సరదా పోరాటాలు ఆకట్టుకుంటాయని చిత్ర బృందం తెలిపింది. దీనికి సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: కె.ఎమ్‌. భాస్కరన్‌, కూర్పు: నాగూరన్‌


సంతానం ‘గులు గులు’

నదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు సంతానం. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గులు గులు’. రత్నకుమార్‌ దర్శకుడు. సర్కిల్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఎస్‌.రాజ్‌ నారాయణన్‌ నిర్మిస్తున్నారు. అతుల్య చంద్ర, ప్రదీప్‌ రావత్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తిరగబడిన లారీ ముందు ప్రశాంతంగా కూర్చుని సంతానం పేకాడుతున్న ఫస్ట్‌లుక్‌ విభిన్నంగా ఉంది. పూర్తి హాస్యంతో కథనం ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ కార్తీక్‌ కన్నా, కూర్పు: ఫిలోమిన్‌ రాజ్‌.


16న ‘చార్లీ 777’ ట్రైలర్‌

న్నడ కథానాయకుడు రక్షిత్‌ శెట్టి నటించిన చిత్రం ‘చార్లీ 777’. కిరణ్‌రాజ్‌ కె దర్శకుడు. జూన్‌ 10న పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు రక్షిత్‌ సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించాడు. ‘ఈ చిత్రం కోసం కొన్ని మైళ్లు ప్రయాణించ. మీ ముందుకు రావడానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నామ’ని రాసుకొచ్చాడు. ఇందులో రక్షిత్‌ ఓ పరిశ్రమలో కార్మికుడిగా నటించాడు. కోపంగా ఉండే తన స్వభావాన్ని చార్లీ అనే కుక్క ఎలా మార్చిందన్నదే కథ. ఈ చిత్రాన్ని మలయాళంలో నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, తెలుగులో రానా, తమిళంలో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌లు విడుదల చేయనుండటం విశేషం.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని