Sourav Ganguly: తుది దశలో గంగూలీ స్క్రిప్ట్
భారత దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని రెండేళ్ల కిందటే ప్రకటించారు. ఈ బయోపిక్‌ని మేమే నిర్మిస్తున్నామని లవ్ ఫిల్మ్స్ (Love Films) పేర్కొంది.
భారత దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని రెండేళ్ల కిందటే ప్రకటించారు. ఈ బయోపిక్‌ని మేమే నిర్మిస్తున్నామని లవ్ ఫిల్మ్స్ (Love Films) పేర్కొంది. ప్రస్తుతం స్క్రిప్ట్ తుది దశలో ఉంది. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే అత్యంత కీలకం కావడంతో దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీన్ని ఫైనల్ చేయడానికి సౌరవ్ (Sourav) సోమవారం రాత్రి కోల్‌కతా నుంచి ముంబయి వచ్చారు. నిర్మాతలు, రచయితలతో మంగళవారం చర్చించి దీనికి ఓకే చెప్పడమే తరువాయి అంటున్నారు. ఇది ఓ కొలిక్కి రాగానే వచ్చే నెలలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. క్రికెట్‌లో రెండు దశాబ్దాలపాటు ఓ వెలుగు వెలిగిన దాదా భారత క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్లలో ముందుంటారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
రూ.1.5 కోట్లకు అడిగినా.. ఆ దున్నను అమ్మేది లేదట
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ambati Rambabu: ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు: మంత్రి అంబటి
-
Crime News
Smita Sabharwal: పదోన్నతుల గురించి మాట్లాడేందుకే వెళ్లా.. స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడిన డీటీ వెల్లడి
-
World News
ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ కాదా?.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక విషయాలు..
-
Politics News
Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత