Published : 05 Feb 2022 14:29 IST

Lata Mangeshkar: మళ్లీ క్షీణించిన లతా మంగేష్కర్‌ ఆరోగ్యం

ముంబయి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ ప్రతీత్‌ సమదాని తెలిపారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత నెలాఖరులో ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించడం అందర్నీ కలవరపాటుకు గురి చేస్తోంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని