Lavanya Tripathi: చిన్న గాయమే కానీ.. లావణ్య త్రిపాఠి క్లారిటీ

తనకు చిన్న గాయమే అయినట్టు నటి లావణ్య త్రిపాఠి స్పష్టం చేశారు.

Published : 13 Jun 2024 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కాలికి నెల క్రితమే గాయమైందని, ఇప్పటికీ అది తగ్గలేదని హీరో వరుణ్‌ తేజ్‌ సతీమణి, నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తెలిపారు. ఆందోళన అవసరం లేదని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఏమైందంటే?తన గాయానికి సంబంధించిన ఫొటోను లావణ్య సోషల్‌ మీడియా వేదికగా బుధవారం పోస్ట్‌ చేశారు. ఏం జరిగిందో చెప్పకపోవడంతో ఫ్యాన్స్‌, నెటిజన్లు కంగారుపడ్డారు. ‘సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుందా?’ అంటూ కామెంట్ల రూపంలో ప్రశ్నించారు. తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవితో మోదీ ఏం మాట్లాడారంటే.. వైరల్‌ వీడియోపై మెగాస్టార్‌ పోస్ట్‌

‘‘ఇది నెల క్రితమే జరిగింది. మెట్లు ఎక్కుతుండగా చీలమండ మడత పడింది. రోజులు గడిచినా నొప్పి మాత్రం తగ్గకపోవడంతో ఎం.ఆర్‌.ఐ, సి.టి స్కాన్‌ చేయించాం. గాయమైనట్టు తెలిసింది. చిన్నదే అయినా నయం కావడానికి విశ్రాంతి తీసుకోవాల్సిందే. కానీ, నేను నిరంతరాయంగా ప్రయాణాలు చేస్తూనే ఉన్నా. రెస్ట్‌ తీసుకోలేదు’’ అని తెలిపారు. తన మామయ్య, నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారోత్సవానికి లావణ్య దంపతులు అందుకే హాజరుకాలేదని కొందరు నెట్టింట అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని