varun tej: మెగా ఇంట పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ నిశ్చితార్థంపై ప్రకటన!
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు. జూన్ 9న నిశ్చితార్థం జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్: మెగా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ (varun tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (lavanya tripathi) నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ప్రతినిధి ట్వీట్ చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్‌లో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరికీ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..