Varun Tej - Lavanya Tripati: వరుణ్ తేజ్ అక్కడ - లావణ్య ఇక్కడ.. పెళ్లి వార్తలు నిజమేనా?
నటుడు వరుణ్ తేజ్ (Varun Tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) వివాహం చేసుకోనున్నారంటూ తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ వార్తల్లో నిజమెంత..?
హైదరాబాద్: మెగా నివాసంలో పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ (Varun tej) త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు తన స్నేహితురాలు, నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati)ని ఆయన వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇరువురి కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఈ నెల 9న హైదరాబాద్‌లో జరగనుందని సమాచారం.
ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గత కొన్నినెలలుగా గాసిప్స్ వస్తున్నాయి. ఇన్నాళ్లు వీటిని పరోక్షంగా ఖండించినా ఇప్పుడు మాత్రం వాళ్ల నుంచి కానీ, వాళ్ల ప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి ఖండన లేకపోవడంతో నిశ్చితార్థం జరగడం పక్కా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ప్రస్తుతం, వరుణ్ తేజ్ విదేశాల్లో ఉండగా, లావణ్య త్రిపాఠి కొత్త సినిమా షూట్ కోసం త్వరలో హైదరాబాద్‌కు రానున్నారు.
ఇక, సినిమాల విషయానికి వస్తే.. 2017లో తెరకెక్కిన ‘మిస్టర్’ కోసం వరుణ్ తేజ్ - లావణ్య తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘అంతరిక్షం’లోనూ ఈ జోడీ సందడి చేసింది. ఈ ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తున్న సమయంలోనే వరుణ్ - లావణ్యకు స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.