Rudhran: లారెన్స్‌ ‘రుద్రుడు’ వాయిదా.. కారణమిదే

రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా కతిరేశన్‌ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రం ‘రుద్రన్‌’ . తెలుగులో ‘రుద్రుడు’గా రాబోతుంది.

Published : 26 Sep 2022 20:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) కథానాయకుడిగా కదిరేశన్‌ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రం ‘రుద్రన్‌’ (Rudhran). యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 23న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. వీఎఫ్‌ఎక్స్‌ పనులకు మరింత సమయం కేటాయించాల్సిరావటంతో ‘రుద్రన్‌’ను వాయిదా వేసినట్టు తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఈ సినిమా తెలుగులో ‘రుద్రుడు’ పేరుతో రానుంది. ప్రియభవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శరత్‌కుమార్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని