Cinema News: ప్రేమ.. లక్ష్యం.. సంఘర్షణ

రంజిత్‌, సౌమ్య మేనన్‌, గగన్‌ విహారి, రావు రమేష్‌, నరేశ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. బెక్కెం వేణుగోపాల్‌

Updated : 22 Apr 2022 12:16 IST

రంజిత్‌, సౌమ్య మేనన్‌, గగన్‌ విహారి, రావు రమేష్‌, నరేశ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. బెక్కెం వేణుగోపాల్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండా గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమాకి మంచి టైటిల్‌ పెట్టారు దర్శకుడు. జి.కె. చక్కటి మ్యూజిక్‌ ఇచ్చారు. మంచి కథతో సినిమా తీసిన నిర్మాతకు బెక్కెం వేణుగోపాల్‌ సపోర్ట్‌గా నిలవడం చిత్ర యూనిట్‌కు శుభపరిణామం’’ అన్నారు. ‘‘ఇదొక చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రం నాకు నచ్చడంతో.. పర్‌ఫెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మిళితమైన ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీతో ఈ చిత్రం రూపొందించాం. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ఓవైపు ప్రేమ మరో వైపు గోల్‌.. ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణను కథానాయిక ఎలా ఎదుర్కొంది అన్నదే ఈ చిత్ర కథాంశం’’ అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో జి.కె, టిప్స్‌ సుప్రీం రాజు, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని