F3: అధ్యక్షా ప్రత్యేక గీతమంటే మినిమం ఇట్టా ఉండాల.. పూజాహెగ్డే పెర్ఫామెన్స్‌ చూశారా..!

‘జిగేల్‌రాణి’ పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పూజాహెగ్డే ‘ఎఫ్‌ 3’ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాట విడుదలైంది.

Updated : 07 Dec 2022 17:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రత్యేక గీతం ‘జిగేల్‌రాణి’తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పూజాహెగ్డే ‘ఎఫ్‌ 3’ సినిమాలోని మరోపాటతో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాట విడుదలైంది. జీవితాన్ని ఎలా అనుభవించాలనుకుంటున్నారో ముగ్గురు వ్యక్తులు వివరించుకునే నేపథ్యంలో సాగుతుందీ సాహిత్యం. ‘అధ్యక్షా లైఫ్‌ అంటే మినిమం ఇట్టా ఉండాల’ అనేది ఈ పాట థీమ్‌. ‘పిట్టగోడపై పెట్టే పిచ్చాపాటి ముచ్చట్లు చైనా వాల్‌పై పెట్టుకుందాం’, ‘అయ్యంగారి కొట్టులో కొట్టే చాయ్‌ను పక్కనెట్టి ఈఫిల్‌ టవర్‌పై ఐస్‌-టీ కొట్టేదాం’ తదితర లైన్లు మెప్పించేలా ఉన్నాయి. ఈ పాటలో పూజాహెగ్డేతోపాటు కథానాయకులు వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బీట్‌కు తగ్గట్టు స్టెప్పులేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌, గీతా మాధురి ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. గతంలో మంచి విజయం అందుకున్న ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. మే 27న విడుదలకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని