Published : 24 May 2022 22:01 IST

kamal haasan: వెనుక నిలబడి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన కమల్‌హాసన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన కథానాయకుడిని చూడాలనుకునేవారు ఎందరో. కనీసం దూరం నుంచైనా చూసి తరించాలని అనుకుంటారు. అలాంటి హీరో వెనుకవచ్చి నిలబడితే, దగ్గరకు వచ్చి కరచాలనం చేస్తే, ఏకంగా కౌగలించుకుంటే.. ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ అదే చేశారు. ఆయన్ను హఠాత్తుగా చూసిన అభిమానులు భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. కమల్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్‌’. ఫహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అభిమానులు నిర్వహించిన ఓ కార్యక్రమానికి వచ్చి కమల్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. ఆ ఆసక్తికర వీడియోను మీరూ చూసేయండి.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని