Liger: ‘లైగర్’ ఫెయిల్యూర్.. పునరాలోచనలో విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘లైగర్’ (Liger)....
హైదరాబాద్: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘లైగర్’ (Liger). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది. దీంతో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరోసారి వీరిద్దరూ చర్చల్లో కూర్చోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ చర్చలు దేని గురించి అంటే..?
పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా సిద్ధం కానున్న చిత్రం ‘జనగణమన’. మహేశ్‌తో ఈ ప్రాజెక్ట్ చేయనున్నట్లు కొన్నేళ్ల క్రితం పూరీ ప్రకటించారు. స్క్రిప్ట్, ఇతర కారణాల వల్ల మహేశ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఇది నిలిచిపోయింది. దీంతో ఇదే ప్రాజెక్ట్‌ని విజయ్‌తో చేయనున్నట్లు ఇటీవల పూరీ ప్రకటించారు. గత నెలలో పట్టాలెక్కిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సైతం పూర్తైంది. ‘లైగర్’ బ్లాక్‌బస్టర్ అవుతుందని, కాబట్టి తమ కాంబోలో రానున్న ‘జనగణమన’ను భారీగా తీర్చిదిద్దాలని వీరు ఆశించారు.
‘లైగర్’ విడుదల అనంతరం అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ‘జనగణమన’ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విజయ్ దేవరకొండ - పూరీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, అన్ని సక్రమంగా ప్లాన్ చేసుకోవాలని వీరిద్దరూ భావిస్తున్నారట. అనవసరంగా సినిమాపై ఖర్చులు పెట్టకూడదని.. బడ్జెట్‌ని కాస్త నియంత్రించుకునేలా ప్రణాళికలు రచించేందుకు మరోసారి కలిసి కూర్చొని చర్చించుకోనున్నారని పలు బాలీవుడ్ పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్