Liger: ‘లైగర్‌’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్‌ బోర్డ్‌

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా సిద్ధమైన పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైగర్‌’కు (Liger) సెన్సార్‌ బోర్డు నుంచి అభ్యంతరాలు...

Updated : 18 Aug 2022 16:58 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా సిద్ధమైన పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైగర్‌’కు (Liger) సెన్సార్‌ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొత్తం 140.20 నిమిషాల రన్‌ టైమ్‌తో సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకి బోర్డు ఏడు మార్పులు చేర్పులు సూచించింది. ఎఫ్‌తో మొదలయ్యే అమర్యాదకరమైన పదాన్ని సినిమాలో చాలాచోట్ల నటీనటులు ఉపయోగించారని.. కాబట్టి అలాంటి పదాలను మ్యూట్‌ చేయమని కోరింది. కొన్ని సీన్స్‌లో ఎదుటివారిపై కోపాన్ని తెలియజేస్తూ నటీనటులు చేసే సైగలు కూడా అసభ్యకరంగా ఉన్నాయని వాటిని బ్లర్‌ చేయమని తెలిపింది. అలాగే, చేతులతో సంజ్ఞ చేసే మరో సన్నివేశం అభ్యంతరకరంగా ఉందని, దాన్ని తొలగించమని చెప్పింది. కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘లైగర్‌’ ఆగస్టు 25న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనన్యా పాండే కథానాయిక.

‘లైగర్‌’కు ట్విటర్‌ ఎమోజీ

మరోవైపు ‘లైగర్‌’కు సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ ప్రత్యేక ఎమోజీని ఇచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడులవుతుండటంతో సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లకు మరింత చేరువ అయ్యే క్రమంలో చిత్ర బృందం ట్విటర్‌కు దరఖాస్తు చేయగా, #Liger హ్యాష్‌టాగ్‌ జత చేయగానే విజయ్‌ దేవరకొండ ఫొటోతో కూడిన ఎమోజీ వస్తుంది. ట్విటర్‌ ఎమోజీని పొందిన మూడో సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఇప్పటివరకూ తెలుగులో ప్రభాస్‌ ‘సాహో’, మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’ చిత్రాలకు మాత్రమే ట్విటర్‌ ఎమోజీలు ఇచ్చింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని