Liger: లైగర్‌.. ట్రైలర్‌ ఆరోజే

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘లైగర్‌’. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 17 Jul 2022 14:03 IST

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తెరకెక్కిస్తున్న మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘లైగర్‌’ (Liger). పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్య పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 21న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా  ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందిన చిత్రమిది. దీనికోసం దేవరకొండ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడంతో పాటు తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఈ చిత్రానికి కూర్పు: జునైద్‌ సిద్ధిఖీ, స్టంట్స్‌: కేచ,  ఛాయాగ్రహణం: విష్ణుశర్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని