Like Share and Subscribe: ఆ ఓటీటీలోకే ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’

‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ఎందులో విడుదలవుతుందంటే?

Published : 03 Dec 2022 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share and Subscribe). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘సోనీ లివ్‌’లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాలో శోభన్‌.. విప్లవ్‌గా, ఫరియా.. వసుధగా కనిపిస్తారు. ఇద్దరూ ట్రావెల్‌ వ్లాగర్లుగా నటించారు. వీడియో షూట్‌ కోసం వెళ్లిన విప్లవ్‌, వసుధలు పీపుల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (పీపీఎఫ్‌) అనే ఓ నక్సల్‌ దళం చేతుల్లో చిక్కుతారు. వీరికి, నక్సల్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? వాళ్లు వసుధ తండ్రిని ఎందుకు చంపాలనుకుంటుంటారు? వారి నుంచి విప్లవ్‌, వసుధ ఎలా తప్పించుకున్నారు? ఈ క్రమంలో వారికి ఎదురైన సవాళ్లేంటి? అన్నది ఈ సినిమా కథ.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు