Like Share And Subscribe: ఆద్యంతం నవ్వులు పంచేలా..

సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. నవంబరు 4న విడుదల కానుంది.

Updated : 31 Oct 2022 10:53 IST

సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share And Subscribe). వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. నవంబరు 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   ‘‘గోల్కొండ హైస్కూల్‌’లో సంతోష్‌ నటన చూసి ముచ్చటేసింది. చాలా పరిణతితో నటించాడు. ఈరోజున తను చాలా సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో తనకు వరుస విజయాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘గాంధీ కామెడీ టైమింగ్‌ నాకు చాలా ఇష్టం. నానిని గురువులా భావించి సంతోష్‌ మంచి నటుడిగా ఎదగడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు మారుతి. హీరో మాట్లాడుతూ.. ‘‘చిత్రసీమలోకి వచ్చాక నాకు మొదట సలహా, ప్రశంస ఇచ్చింది నాని. ఆయన్ని తొలిసారి కలిసినప్పుడు ‘నీలో నన్ను చూసుకున్నా’ అన్నారు. ఇప్పటివరకు నేను అందుకున్న బెస్ట్‌ ప్రశంస అది. తను మా వేడుకకు రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సంతోష్‌ శోభన్‌ కోసమే పుట్టిన కథ ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. ఆద్యంతం నవ్వులు పంచే చిత్రమిది’’ అన్నారు చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ కార్యక్రమంలో నందిని రెడ్డి, ఫరియా, ప్రవీణ్‌ లక్కరాజు, బ్రహ్మాజీ, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు