Like Share & Subscribe: మోసపోయిన సంతోష్‌ శోభన్‌.. నవ్విస్తున్న సినిమా ప్రచారం

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share & Subscribe). ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో ప్రమోషనల్‌ వీడియో విడుదలైంది.

Published : 13 Oct 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా ప్రచారంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. కొందరు తమ చిత్రాన్ని పొగుడుకుంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు తమ సినిమాపై తామే సెటైర్‌ వేసుకుని ఆసక్తి రేకెత్తిస్తారు. రెండో పంథానే ఎంచుకున్నారు నటుడు సంతోష్‌ శోభన్‌ (Santosh Shobhan). ఆయన హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share & Subscribe). ఫరియా అబ్దుల్లా కథానాయిక. సుదర్శన్‌, బ్రహ్మాజీ, నరేన్‌, సప్తగిరి, ‘మిర్చి’ కిరణ్‌ తదితరులు కీలక పాత్రధారులు.

‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ ను నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్‌, సుదర్శన్‌ ఫన్నీగా చేసిన ‘డిస్ట్రిబ్యూటర్ల పంచాయితీ’ అనే స్పెషల్‌ వీడియోను బుధవారం విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ‘‘మనకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారా?’’ అని సంతోష్‌ ప్రశ్నిస్తే... ఎంతమంది ఉన్నారో సుదర్శన్‌ చూపించటం, వారిలో నలుగురిని ఎంపిక చేసుకోవటం, చర్చలు పూర్తయ్యాక వారు యూట్యూబర్లు అని తెలియడంతో సంతోష్‌ అవాక్కవటం లాంటి సరదా సీన్స్‌ ఈ వీడియోలో కనిపించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని