Like Share Subscribe review: రివ్యూ: లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్
Like Share Subscribe review: సంతోష్‌శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రల్లో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Like Share Subscribe review; చిత్రం: లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్; నటీనటులు: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్, బ్రహ్మాజీ, దయానంద్ రెడ్డి, మైమ్ గోపీ, గోవింద్ పద్మసూర్య, సప్తగిరి తదితరులు; సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల; ఛాయాగ్రహణం: ఎ.వసంత్; కూర్పు: రామ్ తూము; రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ; నిర్మాత: వెంకట్ బోయనపల్లి; విడుదల తేదీ: 04-11-2022
తెలుగు చిత్రసీమలో అగ్రతారల చూపంతా క్రిస్మస్, సంక్రాంతి సీజన్లపైనే పడింది. దీంతో ఇప్పుడు బాక్సాఫీస్ ముందు చిన్న సినిమాల సందడి కనిపిస్తోంది. ఈ వారం దాదాపు అరడజనుకు పైగా చిత్రాలు థియేటర్ ముందుకు వరుస కట్టాయి. అందులో ఒకటి ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. ‘ఏక్ మినీ కథ’తో మెప్పించిన సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రమిది. వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచే మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. ప్రభాస్, నాని వంటి స్టార్ హీరోలు ఈ సినిమాకి ప్రచారం చేయడం.. టీజర్, ట్రైలర్లు వినోదాత్మకంగా ఉండి అందరి దృష్టినీ ఆకర్షించడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. (Like Share Subscribe review) మరి ఈ చిత్ర కథేంటి? ప్రచార చిత్రాలతో నవ్వించిన ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో వినోదం పంచింది?
కథేంటంటే: విప్లవ్ ఓ ట్రావెల్ వ్లాగర్. గువ్వ విహారి అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతుంటాడు. రకరకాల ప్రాంతాలు తిరిగి వీడియోలు తీసి.. వాటిని తన ఛానెల్లో అప్లోడ్ చేస్తుంటాడు. ఇలా తన వీడియోలతో మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకొని పాపులర్ యూట్యూబర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలోనే ప్రకృతి అందాల్ని తన కెమెరాలో బంధించేందుకు అరకు వెళ్తాడు. అక్కడికి వసుధ (ఫరియా అబ్దుల్లా) కూడా వస్తుంది. ఆమె కూడా ఓ ట్రావెల్ వ్లాగరే. తన ఛానెల్‌కు 3మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆమెనే విప్లవ్ కూడా స్ఫూర్తిగా భావిస్తుంటాడు. అంతేకాదు ఆమె పెట్టే ట్రావెల్ వీడియోలు చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. తొలుత విప్లవ్‌ను ద్వేషించిన వసుధ తర్వాత అతన్ని ఇష్టపడటం మొదలు పెడుతుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వాళ్లు పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (పీపీఎఫ్) అనే ఓ నక్సల్ దళం చేతుల్లో చిక్కుతారు. మరి వీరికి నక్సల్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? వాళ్లు వసుధ తండ్రిని ఎందుకు చంపాలనుకుంటుంటారు? (Like Share Subscribe review) వీరి నుంచి విప్లవ్, వసుధ ఎలా తప్పించుకున్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? వీరి ప్రయాణంలో బ్రహ్మన్న (బ్రహ్మాజీ), జువ్వా దివాకరం (సుదర్శన్)ల పాత్రేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే: ఓ సీరియస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక చిత్రమిది. ఇందులో ఓవైపు నక్సల్ ఉద్యమానికి సంబంధించిన ఓ సీరియస్ కథ నడుస్తుంటుంది. మరోవైపు ఒక ట్రావెల్ వ్లాగర్స్ జంట సాగించే వినోదాత్మక ప్రయాణం కనిపిస్తుంటుంది. ఇలా రెండు విభిన్న ధ్రువాల్లాంటి నేపథ్యాల్ని సరైన రీతిలో మిక్స్ చేసి ఓ కథగా చెప్పాలంటే చాలా నేర్పు ఉండాలి. కథలోని సీరియస్‌నెస్‌ను.. వినోదాన్ని సరైన రీతిలో బ్యాలెన్స్ చేయలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ సినిమా ఇటు వినోదం పంచలేక.. అటు థ్రిల్ చేయలేక రెండిటికీ చెడ్డ రేవడిలా తయారవుతుంది. ఈ ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చిత్ర విషయంలో అదే జరిగింది. దర్శకుడు ఓ సీరియస్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకొని దాన్ని పూర్తి వినోదాత్మకంగా వడ్డించే ప్రయత్నం చేశాడు. అయితే ఇటు నక్సల్స్ కథలో సరైన సంఘర్షణ లేకపోవడం.. అటు విప్లవ్ - వసుధల కథలో సరైన వినోదం, భావోద్వేగాలు పండకపోవడంతో సినిమా గాడితప్పింది. 90ల నాటి పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (పీపీఎఫ్) నక్సల్ ఉద్యమ నేపథ్యంతో సినిమాని ప్రారంభించిన తీరు ఆకట్టుకుంటుంది. శాంతి చర్చల పేరుతో ప్రభుత్వం వారితో చర్చలు జరపాలనుకోవడం.. ఆ చర్చల్లో పాల్గొనడానికి వచ్చిన నక్సల్ నాయకులు కనిపించకుండా పోవడం.. దీంతో పోలీసు వ్యవస్థపై, ప్రభుత్వంపై పీపీఎఫ్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవ్వడం.. వంటి సన్నివేశాలతో సినిమా తొలి 15నిమిషాలు ఆసక్తిరేకెతిస్తూ సాగిపోతుంది.
ఇక ఆ తర్వాత నుంచి విప్లవ్ ట్రావెల్ వ్లాగింగ్ కథ మొదలవుతుంది. అతని పరిచయ సన్నివేశాలు.. యూట్యూబ్ ఛానెల్‌ను పాపులర్ చేయడం కోసం తను పడే పాట్లను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని నవ్వులు పంచగా.. మరికొన్ని అతిగా అనిపిస్తాయి. విప్లవ్ అరకు వెళ్లడం.. అక్కడ వసుధ పరిచయమవ్వడం.. ప్రేమ పేరుతో అతను ఆమె వెంట తిరగడం.. వంటి ఎపిసోడ్లన్నీ మరీ రొటీన్‌గా అనిపిస్తాయి. విరామానికి ముందు వసుధ తండ్రిపై పీపీఎఫ్ నక్సల్స్ గ్రూప్ కాల్పులు జరపడం.. ఆ వెంటనే అరకులో విప్లవ్, వసుధ అనుకోకుండా పీపీఎఫ్ సభ్యులైన బ్రహ్మన్న (బ్రహ్మాజీ) బృందానికి చిక్కడంతో ద్వితీయార్ధం ఏం జరగనుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. బ్రహ్మాన్న బృందంతో ప్రయాణం ప్రారంభించాక విప్లవ్, వసుధకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? పోలీసులకు నక్సల్స్‌కు మధ్య జరుగుతున్న పోరాటంలో ఎవరు పైచేయి సాధించారు? అన్నది సెకండాఫ్‌లో కీలకం. నిజానికి సీరియస్‌గా సాగాల్సిన ఈ సిల్లీ కామెడీ ఎపిసోడ్స్‌తో మరీ చప్పగా మార్చేశారు దర్శకుడు గాంధీ. పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, సినిమాని ముగించిన తీరు ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించవు.
ఎవరెలా చేశారంటే: ట్రావెల్ వ్లాగర్ విప్లవ్ పాత్రలో సంతోష్ శోభన్ చక్కగా ఒదిగిపోయారు. ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. వసుధ పాత్రలో ఫరియా ఫర్వాలేదనిపించింది. కథలో ఆమె పాత్రను బలంగా తీర్చిదిద్దుకునే అవకాశమున్నా.. అంతగా వాడుకోలేదు. పీపీఎఫ్ దళ సభ్యుడు బ్రహ్మన్నగా బ్రహ్మాజీ, పైరసీ వీడియోగ్రాఫర్ జువ్వా దివాకరంగా సుదర్శన్ అక్కడక్కడా నవ్వులు పంచారు. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకే ఉంటాయి. దర్శకుడు గాంధీ రాసుకున్న కథలో సరైన సంఘర్షణ కనిపించలేదు. సీరియస్‌గా సాగాల్సిన నక్సల్ నేపథ్యాన్ని జబర్దస్త్ కామెడీ స్కిట్లా మార్చేయడంతో ప్రేక్షకులు ఏ దశలోనూ వారి కథతో కనెక్ట్ కాలేరు. దీనికి తోడు విప్లవ్, వసుధ ప్రేమకథలోనూ సరైన భావోద్వేగాలు కనిపించవు. రొటీన్ కామెడీ ట్రాక్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. పాటల్లో ఒకటి రెండు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే అనిపించే స్థాయిలో ఉంది. వసంత్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
+ సంతోష్, ఫరియా నటన
+ బ్రహ్మాజీ పాత్ర
బలహీనతలు
- స్క్రీన్‌ప్లే
- రొటీన్ కామెడీ
- ద్వితీయార్ధం,ముగింపు
చివరిగా: లైక్ అండ్ సబ్‌స్క్రైబ్ చేయడం కష్టమే!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి