Like Share Subscribe: గొప్ప ప్రేమికులంతా ఇలానే పోయారు.. ఆసక్తిగా ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ ట్రైలర్‌

సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేశారు.

Published : 25 Oct 2022 13:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రోమియో- జూలియట్‌, లైలా- మజ్ను, దేవదాసు-పార్వతిలాంటి గొప్ప గొప్ప లవర్స్‌ అందరూ ఇలానే మధ్యలో పోయారు. మనమూ అంతే’ అని అంటున్నారు యువ నటుడు సంతోష్‌ శోభన్‌ (Santosh Shobhan). తను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు ఫరియా అబ్దుల్లా. ఈ ఇద్దరి ప్రేమ కథ ఎలా మొదలైంది? వారికి ఎదురైన సమస్య ఏంటి? తెలియాలంటే ‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share Subscribe) సినిమా చూడాల్సిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ప్రభాస్‌ సోషల్‌ మీడియా వేదికగా ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కామెడీ, సస్పెన్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో హీరో ట్రావెల్‌ బ్లాగర్‌గా కనిపిస్తారు. బ్రహ్మాజీ, సుదర్శన్‌, సప్తగిరి, ఫణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు