‘లిసా’ తన తల్లికి పెళ్లి చేసిందా..?

తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని భావించిన ఓ యువతి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి తన సొంత ఇంటికి వెళుతుంది. ఈక్రమంలోనే ఆమె తన గతాన్ని తెలుసుకుంటుంది. మరోవైపు దెయ్యం వాళ్లను వెంటాడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ దెయ్యం వాళ్లను ఎందుకు వెంటాడుతోంది..?

Published : 04 Jul 2021 18:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని భావించిన ఓ యువతి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి తన సొంత ఇంటికి వెళుతుంది. ఈ క్రమంలోనే ఆమె తన గతాన్ని తెలుసుకుంటుంది. మరోవైపు దెయ్యం వాళ్లను వెంటాడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ దెయ్యం వాళ్లను ఎందుకు వెంటాడుతోంది..? వాళ్ల గతంతో దానికి ఉన్న సంబంధం ఏంటీ..? ఆ యువతి తన తల్లికి పెళ్లి చేయగలిగిందా..? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘లిసా’. అంజలి ‘లిసా’గా ప్రధానపాత్ర పోషించింది. రాజు విశ్వనాథ్‌, బ్రహ్మానందం, మకరంద్‌ దేశ్‌పాండే, యోగిబాబు, కల్యాణి, సలీమా కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో అందుబాటులో ఉంది. తొలి తెలుగు హార్రర్‌ త్రీడీ చిత్రంగా ఈ సినిమాను రాజు విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎస్‌.కె.పిక్చర్స్‌, వీరూ క్రియేషన్స్‌ పతాకంపై వీరేశ్‌ కాసాని సమర్పణలో నిర్మించారు. సురేశ్‌ కొండేటి నిర్మాత. 2019లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులోనూ అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ‘ఆహా’ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రేక్షకులతో పంచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని