Tollywood: మళ్లీ కలిశారు.. అంచనాలు పెంచుతున్నారు
చిత్ర పరిశ్రమలో హీరో, డైరెక్టర్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఓ సినిమాతో హిట్ కొట్టిన కథానాయకుడు, దర్శకుడు మరోసారి కలిసి పని చేస్తుంటే అంచనాలు పెరుగుతాయి. అలా తెరకెక్కుతోన్న చిత్రాలేవంటే?
ఓ చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్న దర్శకుడు, కథానాయకుడు మరోసారి కలిసి పనిచేయబోతున్నారనగానే సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంటుంది. ‘ఈసారి ఏ రికార్డులు బద్దలు కొడతారో’ అంటూ చర్చ మొదలవుతుంది. అలా.. ప్రస్తుతం ఎవరెవరు మళ్లీ కలిసి పనిచేస్తూ అంచనాలు పెంచుతున్నారో ఓ లుక్కేద్దాం..
మహేశ్- త్రివిక్రమ్
హీరో మహేశ్‌బాబు(Mahesh Babu), దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్లో ప్రస్తుతం మూడో చిత్రం రూపొందుతోంది. #SSMB28 వర్కింగ్ టైటిల్‌తో ఆ సినిమా ఇటీవల ప్రారంభమైంది. విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం పంచుకున్న మహేశ్ ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ‘ఒక్క ఫొటోతోనే కిక్ ఇచ్చారు’ అంటూ మహేశ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆ సినిమా టీమ్‌ని ప్రశంసల్లో ముంచెత్తారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఆ చిత్రంలో పూజాహెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sree Leela) కథానాయికలు. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’ మంచి విజయాన్ని అందుకోగా.. రెండో సినిమా ‘ఖలేజా’ అభిమానులు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయిందన్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్- కొరటాల శివ
‘జనతా గ్యారేజ్’ (Janatha Garage)తో క్రేజీ కాంబోగా నిలిచారు హీరో ఎన్టీఆర్ (NTR), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva). ఇప్పుడు వీరిద్దరు #NTR30 (వర్కింగ్ టైటిల్) కోసం కలిసి పని చేస్తున్నారు. ఈ మేరకు గతేడాది విడుదలైన ఓ వీడియో అభిమానుల్లో అప్పటి వరకూ ఉన్న అంచనాల్ని రెట్టింపు చేసింది. అందులోని ‘‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి. తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా...’’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్, అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం అదుర్స్ అనిపించాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ సందడి చేయనుంది.
అల్లు అర్జున్- సుకుమార్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తాను తెరకెక్కించిన ‘ఆర్య’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు సుకుమార్ (Sukumar). ఆ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘ఆర్య 2’ అంతగా అలరించలేకపోయింది. ఈ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa) దేశ వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్టుకావడంతో అన్ని చిత్ర పరిశ్రమల్లో ‘పుష్ప 2’పై ఆసక్తి పెరుగుతోంది.
పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గబ్బర్‌సింగ్’ (Gabbar Singh). ఈ సినిమా అప్పట్లో ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ఈ కాంబోలో ఇంకో సినిమా ఎప్పుడొస్తుందా?’ అని ఎదురుచూసిన అభిమానులకు హరీశ్ ఆ శుభవార్తను 2021లోనే చెప్పారు. పవన్‌తో తాను తెరకెక్కించే సినిమాకి అప్పుడు ‘భవదీయుడు భగత్‌సింగ్’ అని పేరు పెట్టగా.. ఇటీవల ఆ టైటిల్‌ను ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh)గా మార్చారు. ఎప్పుడో ఖరారైన సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడంతో పలు ఊహాగానాలు వినిపించాయి. సోషల్ మీడియా వేదికగా హరీశ్ వాటిని ఖండిస్తూనే ఉన్నారు. ‘గబ్బర్‌సింగ్’లోని ‘పాటొచ్చి పదేళ్లయింది. అయినా పవర్ తగ్గలేదు’ అనే డైలాగ్‌లానే పవన్- హరీశ్ కాంబోకి ఉన్న క్రేజ్ ఎన్నేళ్లైనా తగ్గదని చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండ- పరశురామ్
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గీత గోవిందం’ (Geetha Govindam). 2018లో వచ్చిన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా, మ్యూజికల్‌గానూ మంచి హిట్ కొట్టింది. ఈ క్రేజీ కాంబోలో మరో చిత్రం రాబోతుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.
నితిన్- వెంకీ కుడుముల
‘భీష్మ’ (Bheeshma)తో సక్సెస్ అందుకున్న హీరో నితిన్ (Nithiin), డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula).. తాము మరో చిత్రానికి కలిసి పనిచేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ రష్మికనేకావడం విశేషం. ఈ మూవీ సరికొత్త కాన్సెప్ట్‌తో కమర్షియల్ హంగులతో తెరకెక్కునుంది.
27 ఏళ్ల తర్వాత.. సీక్వెల్‌తో
‘భారతీయుడు’ (Indian)తో సంచలనం సృష్టించిన కాంబో కమల్‌హాసన్ (Kamal Haasan), శంకర్ (Shankar). సుమారు 27 ఏళ్ల తర్వాత ఆ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు 2’ (Indian 2) కోసం వారు మళ్లీ కలిశారు. 2020లో సెట్లో ప్రమాదం జరగడం, కొవిడ్, దర్శక- నిర్మాతల మధ్య తలెత్తిన సమస్యల కారణంగా సీక్వెల్ చిత్రం కొన్నాళ్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సమస్యలు తొలగడంతో పునః ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తైవాన్‌లో జరుగుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
అప్పుడు ‘మాస్టర్’.. ఇప్పుడు ‘లియో’
తమిళ్ హీరో విజయ్ (vijay thalapathy), దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కలయికలో వచ్చిన సినిమా ‘మాస్టర్’ (Master). కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ కాంబోలో ప్రస్తుతం ‘లియో’ (Leo) సినిమా రూపొందుతోంది. పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రిష కథానాయిక. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండడంతో ‘లియో’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత