Cannes 2022: కేన్స్‌లో మెరవనున్న నయన్‌, పూజా, తమన్నా

ప్రఖ్యాత కేన్స్‌ చలన చిత్రోత్సవంలో ఈసారి పలువురు భారతీయ తారలు సందడి చేయనున్నారు. సినిమాల ప్రదర్శనతోపాటు, భిన్న సంస్కృతులు, ఫ్యాషన్‌ మేళవింపుగా సాగే చలన చిత్రోత్సవం ఇది. ప్రతి ఏటా...

Published : 13 May 2022 10:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రఖ్యాత కేన్స్‌ చలన చిత్రోత్సవంలో ఈసారి పలువురు భారతీయ తారలు సందడి చేయనున్నారు. సినిమాల ప్రదర్శనతోపాటు, భిన్న సంస్కృతులు, ఫ్యాషన్‌ మేళవింపుగా సాగే వేడుక ఇది. ప్రతి ఏటా ఫ్రాన్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్‌, కంగనా రనౌత్‌, దీపికా పదుకొణె, సోనమ్‌కపూర్‌, విద్యాబాలన్‌, ప్రియాంక చోప్రా, అమీ జాక్సన్‌.. ఇలా పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ పాల్గొని రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించారు. కాగా, ఈ ఏడాది కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం కేన్స్ చలన చిత్రోత్సవంలో పాల్గొననుంది.

మే 17 నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో అక్షయ్‌కుమార్ (నటుడు, నిర్మాత)‌, ఏఆర్‌ రెహమాన్‌ (అంతర్జాతీయ సంగీత దర్శకుడు), మామ్‌ ఖాన్ ‌(జానపద గాయకుడు), నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (నటుడు), నయనతార (నటి), పూజాహెగ్డే (నటి), ప్రసూన్‌ జోషి (సీబీఎఫ్‌సీ ఛైర్మన్‌), మాధవన్‌ (నిర్మాత), రిక్కీ కేజ్‌ (మ్యూజిక్‌ డైరెక్టర్‌), శేఖర్‌ కపూర్‌ (నిర్మాత), తమన్నా (నటి), వాణీ త్రిపాఠి (నటి) పాల్గొని ఎర్ర తివాచీపై మెరుపులు పూయించనున్నారు. ఇక, భారతీయ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని మాధవన్‌ నిర్మించిన ‘రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్‌’ చిత్రాన్ని కేన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమా స్క్రీనింగ్‌కి మాధవన్‌ హాజరు కానున్నారు. బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె ఈసారి జ్యురీ సభ్యురాలిగా వేడుకల్లో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని