KK: కేకే తెలుగు పాట పాడితే.. హిట్‌ అవ్వాల్సిందే..!

కృష్ణకుమార్‌ కున్నత్‌ అలియాస్‌ కేకే (53) గాయకుడిగా ఎన్నో ఏళ్లపాటు సినీ ప్రియుల హృదయాలను ఏలిన ఆయన అనుకోని విధంగా మంగళవారం రాత్రి హఠాన్మరణం...

Updated : 07 Dec 2022 21:04 IST

మనల్ని అలరించిన ఎన్నో హిట్‌ సాంగ్స్‌ ఆలపించిన గాయకుడాయన

ఇంటర్నెట్‌డెస్క్‌: కృష్ణకుమార్‌ కున్నత్‌ అలియాస్‌ కేకే (53).. గాయకుడిగా ఎన్నో ఏళ్లపాటు సినీ ప్రియుల హృదయాలను ఏలిన ఆయన మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందారు. హిందీలో ఎన్నో పాటలు పాడి స్టార్‌ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, అస్సాం, గుజరాతీ.. ఇలా పలు భాషల్లో మనసుని హత్తుకునేలా, యువతను ఉర్రూతలూగించేలా పాటలు పాడారు. ఇక, తెలుగులో అయితే ఆయన పాడిన ఎన్నో పాటలు సూపర్‌హిట్స్‌ అందుకున్నాయి. ‘కాలేజీ స్టైలే’, ‘ఒకరికి ఒకరై ఉంటుంటే’, ‘ఏ మేరా జహా’, ‘దేవుడే దిగివచ్చినా’, ‘దాయి దాయి దామ్మా’, ‘చెలియా చెలియా’, ‘గుర్తు కొస్తున్నాయి’, ‘అవును నిజం’, ‘ఒక చిన్ని నవ్వే నవ్వి’, ‘ఉప్పెనంత ఈ ప్రేమకు’, ‘మై హార్ట్‌ ఈజ్‌ బీటింగ్‌’, ‘నీకోసమే ఈ అన్వేషణ’, ‘ఐయామ్‌ వెరీ సారీ’, ‘ఎవ్వరినెప్పుడు తన వలలో’.. ఇలా చెప్పుకొంటూ వెళితే కేకే ఆలపించిన ఎన్నో సూపర్‌ హిట్‌ పాటలు ఆయా హీరోల కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఆణిముత్యాలయ్యాయి. కేకే ఆకస్మిక మరణంతో సినీ సంగీత లోకం మూగబోయిన వేళ.. ఆయన ఆలపించిన తెలుగు సూపర్‌ హిట్స్‌ని ఓసారి గుర్తు చేసుకుందాం..!












Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని