Puri Musings: పూరీ భయ్యా.. కొత్త కాన్సెస్ట్‌ అదిరింది

నీ జీవితం ఎలా ఉంది? అని ఎదుటివారిని అడిగితే.. ‘ఏదో జీవితం అలా వెళ్లిపోతుంది. కాలంతోపాటు నేను అలా సాగిపోతున్నా’ అని అందరూ చెబుతుంటారు..

Published : 31 May 2021 12:57 IST

జీవించడమంటే సరైన అర్థమిది..!

హైదరాబాద్‌: నీ జీవితం ఎలా ఉంది? అని ఎదుటివారిని అడిగితే.. ‘ఏదో జీవితం అలా వెళ్లిపోతుంది. కాలంతోపాటు నేను అలా సాగిపోతున్నా’ అని అందరూ చెబుతుంటారు. ఇది మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ, తాజాగా పూరీజగన్నాథ్‌.. ఒక మనిషి ఎలా జీవించాలి అనే దాని గురించి ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా వివరించారు. జీవితమంటే ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని.. ముఖ్యంగా తరచూ సవాళ్లు ఎదుర్కొవాలని ఆయన అన్నారు. ‘లివ్‌ డేంజరస్లీ’ గురించి ఆయన ఏమన్నారంటే..

‘లివింగ్‌ డేంజరస్లీ ఈజ్‌ ది ఓన్లీ వే అని ఎంతోమంది చెప్పారు. సవాళ్లు లేని జీవితాన్ని కోరుకోవద్దు. సెక్యురిటీ ఇవ్వమని జీవితాన్ని అడగవద్దు. ఎలాంటి ఎత్తుపల్లాలు లేని సాధారణ మైదానంలో బతుకుదామనుకుంటారు అందరూ. కానీ, జీవితంలో ఎత్తైన కొండలు, పర్వతాలు అనేవి ఉండాలి. రిస్క్‌ తీసుకోవడం.. రిస్క్‌లోకి దూకడమే మన క్యారెక్టర్‌ అవ్వాలి. చేసే పనులేప్పుడూ ఒకే విధంగా ఉండకూడదు. అలా ఉంటే బోరింగ్‌గా ఉంటుంది. జీవితం అనే కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగించేద్దాం. ఇలాంటి ఆలోచనా విధానం మనిషికి అవసరం’

‘జీవితాన్ని ఎప్పుడూ దూరం నుంచి చూడొద్దు. జీవితం అనే పోటీలో పాల్గొనాలి. జీవితమంటే మనం మాత్రమే కాదు.. మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. వాళ్లందర్నీ చూడు.. వాళ్లకంటే డేంజరేస్‌గా ఏమైనా చేయగలవేమో ఆలోచించు. ఒక్కసారి ప్రయత్నించు చూడు. భయం దెయ్యం లాంటిది. అది చెప్పినట్లు అస్సలు వినొద్దు. ఆశల్ని, కలల్ని, ఫాలో అయిపో. జీవితమంటేనే ఎన్నో సాహసాలతో కూడుకున్నది. బతికితే డేంజరస్‌గానే బతకాలి. సాదాసీదాగా కాదు. అది మనకి వద్దు. లివ్‌ డేంజరస్లీ’ అని పూరీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని