Lokesh Kanagaraj: సూర్య, కార్తిలతో ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ చేస్తా: లోకేశ్‌ కనగరాజ్‌

మలయాళీ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియం’పై మనసు పారేసుకున్నారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ (Lokesh Kanagaraj). కోలీవుడ్‌ స్టార్‌హీరోలు, అన్నదమ్ములు సూర్య (Suriya), కార్తిలతో (karthi) ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకుంటున్నట్ల...

Published : 11 Aug 2022 11:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మలయాళీ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియం’పై మనసు పారేసుకున్నారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ (Lokesh Kanagaraj). కోలీవుడ్‌ స్టార్‌హీరోలు, అన్నదమ్ములు సూర్య (Suriya), కార్తిలతో (karthi) ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ‘విక్రమ్‌’తో (Vikram) సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్న ఆయన తాజాగా ఓ కోలీవుడ్‌ పత్రికతో ముచ్చటిస్తూ తన మనసులోని మాట బయటపెట్టారు.

‘‘కమల్‌హాసన్‌కు (Kamal Haasan) నేను వీరాభిమానిని. ఆయనతో సినిమా చేయాలనే నా కల ‘విక్రమ్‌’తో నెరవేరింది. ఈ సినిమా సక్సెస్‌ పట్ల నాకెంతో ఆనందంగా ఉంది. ‘విక్రమ్‌’ చూసిన తర్వాత ‘మైండ్‌ బ్లోయింగ్‌’ అంటూ విజయ్‌ (Vijay) నాకు మెసేజ్‌ పంపారు. ఇక, రజనీ సర్‌ ఈ చిత్రాన్ని రెండుసార్లు చూశారు. నన్నెంతో మెచ్చుకున్నారు. ఇటీవల నేను మలయాళీ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ చూశా. సూర్య, కార్తి ప్రధాన పాత్రలుగా ఆ ప్రాజెక్ట్‌ని తమిళంలో రీమేక్‌ చేయాలనుకుంటున్నా. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలో కార్తి, బీజుమేనన్‌గా సూర్యని అనుకుంటున్నా. ప్రస్తుతానికి నా ఫోకస్‌ మొత్తం ‘ఖైదీ-2’, ‘విజయ్‌-67’ ప్రాజెక్ట్‌లపైనే ఉంది’’ అని లోకేశ్‌ వివరించారు.

2019లో విడుదలైన ‘ఖైదీ’తో లోకేశ్‌ కనగరాజ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకోవడంతో విజయ్‌, కమల్‌ హాసన్‌ వంటి స్టార్‌ హీరోలతో పనిచేసే అవకాశం ఆయనకు దక్కింది. ఇటీవల విడుదలైన ‘విక్రమ్‌’ సక్సెస్‌ తర్వాత కోలీవుడ్‌లోని స్టార్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో లోకేశ్‌ కూడా చేరిపోయారు. ఈ సినిమా తర్వాత ఆయన విజయ్‌తో ఓ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. త్వరలోనే అది పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాదిలో ‘ఖైదీ-2’ మొదలయ్యే అవకాశం ఉందని ఇటీవల కార్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు