LOLLIPOP: తొలి పాన్‌ ఇండియా మ్యూజిక్‌ వీడియో ‘లాలీపాప్‌’.. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన మహేశ్‌

‘మొదటిసారి.. మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే, ఏది రాగం ఏది తాళం తెలియదాయో అయ్యో పాపం’

Published : 07 Apr 2022 01:39 IST

హైదరాబాద్‌: ‘మొదటిసారి.. మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే, ఏది రాగం ఏది తాళం తెలియదాయో అయ్యో పాపం’ అంటూ ప్రేమమైకంలో తన్మయత్వం చెందుతున్నాడు సుధాకర్‌ కొమాకుల. అనన్య శర్మతో కలిసి సుధాకర్‌ నటించిన పాన్‌ ఇండియా మ్యూజిక్‌ వీడియో ‘లాలీపాప్‌’. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ వీడియో తెలుగు వెర్షన్‌ను అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేసి ‘లాలీపాప్‌’ టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. విజయ్‌ బుల్గానిన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు సురేశ్‌ బనిశెట్టి సాహిత్యం అందించారు. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు.  వినయ్‌ షణ్ముఖ్‌ దర్శకత్వం వహించిన ఈ మ్యూజిక్‌ వీడియోను ఎస్‌.కృష్ణ నిర్మించారు. భాను మాస్టర్‌, పవన్‌ రిఫ్లెక్షన్‌ కొరియోగ్రఫీ అందించారు. యూత్‌ను ఆకట్టుకునేలా మ్యూజిక్‌ వీడియోను తీర్చిదిద్దారు. సుధాకర్‌, అనన్య, జై జాస్తి, మేఘనా సునీల్‌ తెరపై అందంగా కనిపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని