London Files: ‘లండన్‌ ఫైల్స్‌’ తెరవనున్న ఓం సింగ్‌

అర్జున్‌ రాంపాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘లండన్‌ ఫైల్స్‌’. వూట్‌లో విడుదల కానున్న ఈ ఆరు ఎపిసోడ్ల థ్రిల్లర్‌ సిరీస్‌కు సంబంధించి ట్రైలర్‌ బుధవారం విడుదలయ్యింది. పూర్తిగా యూకేలోనే

Updated : 14 Apr 2022 09:19 IST

ర్జున్‌ రాంపాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘లండన్‌ ఫైల్స్‌’. వూట్‌లో విడుదల కానున్న ఈ ఆరు ఎపిసోడ్ల థ్రిల్లర్‌ సిరీస్‌కు సంబంధించి ట్రైలర్‌ బుధవారం విడుదలయ్యింది. పూర్తిగా యూకేలోనే చిత్రీకరించిన ఈ సిరీస్‌లో అర్జున్‌ ‘ఓం సింగ్‌’ అనే డిటెక్టివ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో పురబ్‌ కోహ్లీతో పాటు గోపాల్‌ దత్‌, సప్నా పబ్బీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జార్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌కు సచిన్‌ పతక్‌ దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 21 నుంచి వూట్‌ సెలక్ట్‌లో ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ప్రసారం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని