Love Me: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్‌ హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

అశిష్‌ ప్రధానపాత్రలో నటించిన ‘లవ్‌ మీ’ ఓటీటీలోకి వచ్చేసింది. 

Published : 14 Jun 2024 09:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌ మీ’. ఇఫ్‌ యు డేర్‌.. అన్నది ఉపశీర్షిక. దీన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం (Love Me) యూత్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడీ రొమాంటిక్ హారర్‌ థ్రిల్లర్‌ ఓటీటీ ఆడియన్స్‌ ముందుకు వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎలాంటి సమాచారం లేకుండా ప్రసారం కావడంతో సినీ ప్రియులు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు.

రివ్యూ: మహారాజ.. విజయ్‌ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?

కథేంటంటే: అర్జున్‌ (ఆశిష్‌)కు దేవుడు, దెయ్యాలపై అసలు నమ్మకం ఉండదు. ఎక్కడైనా దెయ్యాలున్నాయని తెలిస్తే చాలు అక్కడికి వెళ్లి.. అవి లేవని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తుంటాడు. ఆ వీడియోలన్నింటినీ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పెట్టి డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ విషయంలో అతనికి తన సోదరుడు ప్రతాప్‌ (రవికృష్ణ) కూడా సహాయ పడుతుంటాడు. ఈ క్రమంలో ఓసారి అర్జున్‌కు ప్రతాప్‌ ప్రియురాలు ప్రియ (వైష్ణవి చైతన్య) (Vaishnavi Chaitanya) ద్వారా దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుస్తుంది. ఎలాగైనా ఆ దెయ్యాన్ని తన ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుని అర్జున్‌ అక్కడికి వెళ్తాడు. మరి ఆ తర్వాత తనెలాంటి పరిణామాల్ని ఎదుర్కొన్నాడు? దివ్యవతి కథేంటి? ఆమెకు గతంలో కనిపించకుండా పోయిన పల్లవి, నూర్, ఛరిష్మాలకు ఉన్న సంబంధం ఏంటి? అసలు దివ్యవతి కథను అర్జున్‌ దగ్గరకు ప్రియ ఎందుకు చేర్చింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు