మహేశ్‌ రిలీజ్‌ చేసిన ‘ఏవో ఏవో కలలే’!

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులోని ‘ఏవో ఏవో కలలే’అంటూ సాగుతున్న లిరికల్‌ వీడియో సాంగ్‌ను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విడుదల చేశారు. భాస్కర్‌బట్ల రచించిన

Published : 25 Mar 2021 14:01 IST

హైదరాబాద్‌: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని ‘ఏవో ఏవో కలలే’అంటూ సాగుతున్న లిరికల్‌ వీడియో సాంగ్‌ను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విడుదల చేశారు. భాస్కర్‌ భట్ల రచించిన ఈ గీతాన్ని జోనితా గాంథీ, నకుల్‌ అభ్యంకర్‌ ఆలపించారు. పవన్‌ సీహెచ్‌ స్వరాలు సమకూర్చారు. శేఖర్‌ వీజే కొరియోగ్రఫీలో నాగచైతన్య, సాయిపల్లవి అదిరిపోయే స్టెప్పులతో అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ‘సారంగదరియా’పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ ‘లవ్‌స్టోరీ’ని థియేటర్లలో ఏప్రిల్‌ 16న విడుదల చేయనున్నారు. మరి లేటెందుకు మీరు ఆ వీడియోను చూసేయండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని