వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’

ఎన్ని పాటలు వచ్చిన జానపద గీతాలకు ఉండే క్రేజే వేరు. అలాంటి జానపదానికి సాయిపల్లవి లాంటి ఎనర్జిటిక్‌ డ్యాన్సర్‌ స్టెప్స్‌ తోడైతే కళ్లకు కనువిందే. అలాంటి పాటే  ‘సారంగదరియా..’అంటూ వచ్చేసింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి

Published : 28 Feb 2021 11:03 IST

హైదరాబాద్‌: ఎన్ని పాటలు వచ్చిన జానపద గీతాలకు ఉండే క్రేజే వేరు. అలాంటి జానపదానికి సాయిపల్లవి వంటి ఎనర్జిటిక్‌ హీరోయిన్‌‌ స్టెప్స్‌ తోడైతే  కనువిందే. అలాంటి పాటే  ‘సారంగదరియా..’అంటూ వచ్చేసింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్‌స్టోరీ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  కాగా, ‘సారంగదరియా’అంటూ సాగుతున్న పాట లిరికల్‌ వీడియోను తాజాగా మరో నటి సమంత విడుదల చేశారు. సుద్దాల ఆశోక్‌తేజ అందించి సాహిత్యానికి గాయని మంగ్లీ మ్యాజిక్‌ వాయిస్‌ తోడవడంతో మరోసారి వినాలనిపించేంత అద్బుతంగా పాట ఉంది. పవన్‌ సీహెచ్‌ అందించిన మంచి బీట్‌తో కూడిన సంగీతం పాట విన్నవాళ్లు స్టెప్పులు వేసేంత ఊపునిస్తుంది. అమిగోస్‌ క్రియేషన్స్‌పై తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు  రానుంది. మరి అప్పటి వరకు ఈ సాంగ్‌ వింటూ ఎంజాయ్‌ చెయ్యండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని