Love story: చై-సాయి పల్లవి ‘లవ్‌స్టోరీ’ కొత్త తేదీ ఇదే!

Love story: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ని సెప్టెంబరు 24న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Published : 11 Sep 2021 02:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగచైతన్య-సాయి పల్లవి జంటగా, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘లవ్‌స్టోరీ’. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడింది. తాజాగా వినాయకచవితిని పురస్కరించుకుని చిత్ర బృందం కొత్త తేదీని ప్రకటించింది. సెప్టెంబర్‌ 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 16న రిలీజ్‌ చేస్తామని ప్రకటించినప్పటికీ.. రెండో దశ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబరు10న విడుదలంటూ మరోసారి ప్రకటించారు. అయితే, చివరిలో ‘లవ్‌స్టోరీ’ వెనక్కి తగ్గడంతో గోపీచంద్‌ ‘సీటీమార్’ విడుదలైంది. ఇప్పటికే విడుదల చేసిన ‘లవ్‌స్టోరీ’ టీజర్‌, ‘సారంగ దరియా’ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సారంగదరియా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని