Love story: చై-సాయిపల్లవిల ‘లవ్‌స్టోరీ’ వచ్చేది ఇక అప్పుడేనా?

Love story: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ విడుదల సెప్టెంబరు చివరి వారానికి వాయిదా పడినట్లు టాలీవుడ్‌ టాక్‌.

Published : 30 Aug 2021 15:06 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచినా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేని పరిస్థితి ఉండటంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాలు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి వేస్తున్నాయి. అలాంటి వాటిలో నాగచైతన్య-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ ఒకటి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు సెప్టెంబరు 10న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కానీ, ఆ తేదీకి కూడా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఎందుకంటే  ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్‌ షోపైన, టికెట్‌ ధరలపైన ఆ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని ఊహించారంతా. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. దాంతో ‘లవ్‌స్టోరి’ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే సెప్టెంబరు చివరి వారంలో మూవీ థియేటర్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని