Love Today: ‘లవ్ టుడే’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
‘లవ్ టుడే’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. స్వీయ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన చిత్రమిది.
ఇంటర్నెట్ డెస్క్: స్వీయ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’ (Love Today). కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో అదే పేరుతో ఈ నెల 25న థియేటర్లలో విడుదలై, ఇక్కడా ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘లవ్ టుడే’ని డిసెంబరు 2 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనున్నట్టు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, అది ఏయే భాషల్లో రిలీజ్ అవుతుందో చెప్పలేదు. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుండంతో కేవలం తమిళం భాషలోనే ఓటీటీ విడుదల చేస్తారా? తెలుగు ఆడియోను అందిస్తారా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సత్యరాజ్, రాధిక శరత్‌కుమార్, ఇవానా, రవీనా రవి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలో నవంబరు 4న విడుదలైంది.
ఇదీ కథ: ఐటీ ఉద్యోగి అయిన ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నిఖిత (ఇవానా) ప్రేమించుకుంటారు. పెళ్లితో ఒక్కటి కావాలనుకుంటారు. వీరి ప్రేమ విషయం నిఖిత ఇంట్లో తెలుస్తుంది. ఆమె తండ్రి శాస్త్రి (సత్యరాజ్) ఒకసారి ప్రదీప్‌ని ఇంటికి తీసుకురమ్మని చెబుతాడు. ఓ షరతుపై వారి ప్రేమని అంగీకరిస్తాడు. ఒక రోజంతా ఒకరి ఫోన్‌ని మరొకరు మార్చుకోవాలనేది ఆ కండిషన్. ఒకరి ఫోన్లు మరొకరు చూసుకున్నాక కూడా ఆ జంట పెళ్లికి సిద్ధమైందా? తన ప్రేయసి ఫోన్లో అబ్బాయిలతో సందేశాలు చూశాక ప్రదీప్ ఎలా స్పందించాడు? ప‌్రదీప్ ఫోన్లో యాప్స్, ఇతర సందేశాలు చూశాక నిఖిత పరిస్థితి ఏంటి? పెళ్లైందా? లేదా? తదితర విషయాలతో మిగతా కథ సాగుతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
YSRCP: వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: వైకాపా ఎమ్మెల్యే సుధాకర్
-
Politics News
Andhra News: నీతో మాట్లాడను, వెళ్లవమ్మా.. వెళ్లు!: మహిళపై వైకాపా ఎమ్మెల్యే అసహనం
-
Ap-top-news News
AP Govt: రాజధాని కేసులను త్వరగా విచారించండి: సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
-
World News
Bill Gates: వంటవాడిగా బిల్‌గేట్స్.. రోటీ తయారీ!
-
Ap-top-news News
Andhra News: వలస కూలీగా సర్పంచి
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!