ఫోన్లు మార్చుకోవడంతో తారుమారైన ప్రేమికుల జీవితాలు.. తర్వాతేంటి..?

తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘లవ్‌ టుడే’. త్వరలో ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది.

Published : 17 Nov 2022 11:24 IST

హైదరాబాద్‌: వాళ్లిద్దరూ స్నేహితులు.. అనుకోకుండా వారి మధ్య ప్రేమ చిగురించింది.. పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు.. పెద్దవాళ్లు పెట్టిన కండిషన్‌తో వాళ్లిద్దరూ సెల్‌ఫోన్లు మార్చుకున్నారు.. కట్‌ చేస్తే అప్పటిదాకా ప్రశాంతంగా సాగిన వారి జీవితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. వాళ్ల మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ పెళ్లి పీటలెక్కిందా? విడిపోవడానికి దారి తీసిందా? వంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ టుడే’ (Love Today). ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇవానా కథానాయిక.

తమిళంలో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం త్వరలో తెలుగులోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం ‘లవ్‌ టుడే’ తెలుగు ట్రైలర్‌ను విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ‘నీ గురించి నాకు మొత్తం తెలుసురా’, ‘నాకూ నీ గురించి మొత్తం తెలుసు బేబీ’ అంటూ హీరో హీరోయిన్స్‌ మధ్య సాగే లవ్‌టాక్స్‌తో మొదలైన ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. అమ్మాయి తరఫు ఇంటి పెద్దగా సత్యరాజ్‌ నటన, ఆయన పెట్టిన కండిషన్‌, దానివల్ల హీరోహీరోయిన్స్‌ మధ్య వచ్చే మనస్పర్థలు.. మధ్యలో యోగిబాబు కామెడీతో సినీ ప్రియులను ఈ ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం మెప్పించేలా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని