ఆనందమా..ఆనందమదికే అంటున్న యువ హీరో!

బాల నటుడి స్థాయి నుంచి హీరోగా ఎదిగిన వారిలో తేజ సజ్టా ఒకరు. ఇటీవల విడుదలైన ‘జాంబీరెడ్డి’తో సోలో హీరోగా సక్సెస్‌ అందుకున్నారు. తాజాగా తేజ, ‘ఐ వింక్‌’బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ జంటగా ‘ఇష్క్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ‘నాట్‌ ఏ లవ్‌

Published : 13 Feb 2021 18:02 IST

హైదరాబాద్‌: బాలనటుడి నుంచి హీరోగా ఎదిగిన వారిలో తేజ సజ్జా ఒకరు. ఇటీవల విడుదలైన ‘జాంబీరెడ్డి’తో సోలో హీరోగా సక్సెస్‌ అందుకున్నారు. తాజాగా తేజ, ‘ఐ వింక్‌’ బ్యూటీ ప్రియా వారియర్‌ జంటగా ‘ఇష్క్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ‘నాట్‌ ఏ లవ్‌ స్టోరీ’అనేది ఉపశీర్షిక. ఈ క్రమంలోనే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘ఆనందమా..ఆనందమదికే’అంటూ సాగుతున్న లిరికల్‌ వీడియోను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ నటుడు నితిన్‌ ట్విటర్‌లో ఈ సాంగ్‌ను పోస్ట్‌ చేశారు. ఈ ప్రేమ గీతాన్ని సిధ్‌ శ్రీరామ్‌, సత్యయామిని ఆలపించగా శ్రీమణి సాహిత్యం అందించారు. మహతి స్వరసాగర్‌ బాణీలు కట్టారు. మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఆ ఆనందం మీకు కావాలంటే ఈ సాంగ్‌ను చూసేయండి!

ఇవీ చదవండి!

సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన తొలి జానపద గీతం!

ఏంట్రా మన ఖర్మ..అంటున్న విజయ్‌సేతుపతి!

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని