Shah Rukh Khan: వజ్రాల నేమ్‌ప్లేట్‌ పెట్టించిన కింగ్‌ ఖాన్‌.. సందడి చేస్తున్న ఫ్యాన్స్‌

షారుక్‌ ఇంటికి బ్రాండ్‌గా నిలుస్తున్న నేమ్‌ ప్లేట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Published : 22 Nov 2022 01:13 IST

ముంబయి: ముంబయి సందర్శనకు వెళ్లిన చాలా మంది మన్నత్‌ను కూడా చూడాలనుకుంటారు. అంతలా అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ఇల్లు. మన బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ఖాన్‌ కలల సౌథమైన ఈ భవనం అందం మరింత రెట్టింపైంది. అందుకు కారణం ఇంటి గేట్‌కు వజ్రాలు పొదిగిన నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేయడమే. దీంతో అభిమానులు ఆ గేట్‌ దగ్గర ఫొటోలకు పోజిలిస్తున్నారు. గతంలో సుమారు రూ.35 లక్షలు పెట్టి తన ఇంటికి వజ్రాల నేమ్‌ప్లేట్‌ పెట్టించారు షారుఖ్‌. కానీ వారంలోపే అందులోని ఒక వజ్రం కనిపించకపోవడంతో దానిని తీసేశారు. తాజాగా ఆ వజ్రం ఇంటిలోని తోటలో కనిపించడంతో తిరిగి అమర్చారు. షారుక్‌ ఇంటికి బ్రాండ్‌గా నిలుస్తున్న ఈ నేమ్‌ ప్లేట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

షారుక్‌కు మరో గౌరవం

మూడు దశాబ్దాలకు పైగా తన చిత్రాలతో అలరిస్తున్నందుకు గానూ షారుక్‌ను మరో గౌరవ పురస్కారం వరించింది. రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ పెస్టివల్‌లో షారుక్‌కు గౌరవ పురస్కారం ఇచ్చారు. సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ పురస్కారాన్ని అందుకోనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి 10 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో 41 భాషలకు చెందిన 131 సినిమాలను, షార్ట్‌ ఫిల్మ్‌లను ప్రదర్శించనున్నారు. 61 దేశాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో మెరవనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని