లూసిఫర్‌ రీమేక్‌: ఆ మార్పులు చేశారా?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్‌ చిత్రాల హవా నడుస్తోంది. పలువురు కథానాయకులు

Published : 05 Feb 2021 02:15 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్‌ చిత్రాల హవా నడుస్తోంది. పలువురు కథానాయకులు వరుసగా రీమేక్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వాటిలో మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ ఒకటి. అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ చిత్రంలో నటిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే మొదలైంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కొన్ని ఆసక్తికర వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

మాతృకలో మోహన్‌లాల్‌ పోషించిన స్టీఫెన్‌ పాత్రను చిరు పోషిస్తున్నారు. అందులో ఆ పాత్ర మొదటి నుంచి చివరి వరకూ గంభీరంగా ఉంటుంది. కానీ, తెలుగు చిత్రానికి వచ్చే సరికి కేవలం మాతృక కథలోని ఆత్మను మాత్రం తీసుకుని చిరు అభిమానులు కోరుకున్న మాస్‌ అంశాలన్నీ జోడించారట. అంతేకాదు, కథానాయిక పాత్ర కూడా ఉంటుందని టాక్‌. ఇక చిరంజీవి సినిమా అంటే అదిరే స్టెప్‌లు ఉండాల్సిందే. మలయాళంలో అసలు వాటి జోలికే పోలేదు.(ఐటమ్‌ సాంగ్‌ తప్ప) కానీ, తెలుగులో చిరు ఇమేజ్‌కు తగ్గట్టు పాటలు ఉంటాయని టాక్‌. అంతేకాదు, ‘లూసిఫర్‌’ను మించి ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటాయని తెలుస్తోంది. ఈ మార్పులన్నీ సినిమాకు ప్లస్‌ అవుతాయా? లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే!

ఇదీ చదవండి...

సోషల్‌ మీడియాలో వేధిస్తున్నారు: మాధవీలత

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు