‘లూసిఫర్‌’ ముచ్చట దసరాకు చెబుతారా?

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ‘లూసిఫర్‌’ రీమేక్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి యువ దర్శకుడు సుజిత్‌ దర్శకత్వం వహిస్తారని చిరు గతంలో చెప్పారు. అయితే అతని స్థానంలో సీనియర్‌ వి.వి.వినాయక్‌

Updated : 29 Jul 2020 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ‘లూసిఫర్‌’ రీమేక్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి యువ దర్శకుడు సుజిత్‌ దర్శకత్వం వహిస్తారని చిరు గతంలో చెప్పారు. అయితే అతని స్థానంలో సీనియర్‌ వి.వి.వినాయక్‌ వచ్చారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేకపోయినా... ఇప్పటికే వినాయక్‌ సినిమా కథ విషయంలో తనదైన శైలిలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో చిరు-వినాయక్‌ కలసి కూర్చొని స్క్రిప్ట్‌ ఫైనల్‌ చేస్తారని తాజా సమాచారం. 

చిరంజీవితో ‘ఠాగూర్‌’, ‘ఖైదీ నెం.150’ లాంటి హిట్‌ సినిమాలు ఇచ్చిన వినాయక్‌... ఇప్పుడు మూడోసారి జట్టుకట్టబోతున్నారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ దసరా నాటికి సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. మాతృక నుంచి కథను మాత్రమే తీసుకొని దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కథానాయకుడి సోదరి పాత్ర చాలా కీలకం. ఈ పాత్ర కోసం ఖుష్బూ, సుహాసిని, రమ్యకృష్ణ పేర్లను పరిశీలించారు. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. 

ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడిన చిత్రీకరణను త్వరలో మొదలుపెడతారని తెలుస్తోంది. ఇందుకోసం నగరంలో ఓ సెట్‌ తీర్చిదిద్దారు. ‘ఆచార్య’, ‘లూసిఫర్‌’ రీమేక్‌తో పాటు బాబి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి చిరంజీవి సిద్ధమవుతున్నారు. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని