‘లూసిఫర్‌2’ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందా?

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’. 2019లో విడుదలైన

Published : 08 Jan 2021 01:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పొలిటికల్‌ లీడర్‌ స్టీఫెన్‌ గట్టుపల్లిగా మోహన్‌లాల్‌ నటన ఆకట్టుకుంది. దీనికి కొనసాగింపు చిత్రం ఉంటుందని క్లైమాక్స్‌లో చెప్పేశారు.

ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కరోనా కారణంగా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీక్వెల్‌ చర్చలు మొదలైనట్లు సమాచారం. రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను మోహన్‌లాల్‌కు పృథ్వీరాజ్‌ వివరించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా మారకముందు స్టీఫెన్‌ గట్టుపల్లి ఏం చేసేవాడు? ప్రపంచాన్ని శాసించే బంగారం, వజ్రాల మాఫియాకు స్టీఫెన్‌కు సంబంధం ఏంటి? అబ్రహాం ఖురేషి.. స్టీఫెన్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? తెలియాలంటే ‘లూసిఫర్‌2’ చూడాల్సిందే.

ప్రస్తుతం మొదటి భాగం ‘లూసిఫర్‌’ను తెలుగులో చిరంజీవి రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్‌రాజా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్‌. ఒకవైపు తెలుగులో మొదటి భాగం రీమేక్ అవుతుంటే మలయాళంలో సీక్వెల్‌ను మొదలు పెట్టే పనిలో ఉండటం విశేషం.

ఇవీ చదవండి..

మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌ ట్రైలర్‌ చూశారా?

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఆ సీక్వెల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని