Lucky Lakshman: నవ్వించే ‘లక్కీ లక్ష్మణ్’
సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్.అభి తెరకెక్కించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. హరిత గోగినేని నిర్మాత. దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సయ్యద్ సోహైల్ (Sohel), మోక్ష (Mokksha) జంటగా ఎ.ఆర్.అభి తెరకెక్కించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’ (Lucky Lakshman). హరిత గోగినేని నిర్మాత. దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సోహైల్ మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక నా నుంచి వస్తున్న తొలి చిత్రమిది. దీన్ని అన్ని రకాల వాణిజ్యాంశాలతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధం చేశాం’’ అన్నారు. ‘‘ఓ సినిమా కోసం ఏం చేయాలో అవన్నీ చేశాం. ఇక బాధ్యతంతా ప్రేక్షకులదే. మా ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు నిర్మాత హరిత. దర్శకుడు అభి మాట్లాడుతూ.. ‘‘టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. త్వరలో ట్రైలర్‌తో పాటు రెండు పాటలు విడుదల చేస్తాం. సినిమా చూసి థియేటర్ నుంచి చిరునవ్వులతో బయటకు వస్తారు. ఇందులో అన్ని ఎమోషన్స్ పుష్కలంగా ఉన్నాయి. సోహైల్ అద్భుతంగా నటించాడు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, మెహబూబ్, మల్కాపురం శివకుమార్, దేవీ ప్రసాద్, సన్నీ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: నెల్లూరు జిల్లాలో వైకాపా కోటకు బీటలు.. పార్టీకి దూరమవుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు
-
India News
Asaram Bapu: అత్యాచారం కేసులో.. ఆశారాంకు మరోసారి జీవితఖైదు
-
General News
CRPF Jobs: సీఆర్పీఎఫ్లో ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తుకు నేడే తుది గడువు
-
Crime News
Bribe: రూ.2.25 లక్షల లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన అధికారి
-
Movies News
Social Look: క్యాప్షన్ కోరిన దీపికా పదుకొణె.. హాయ్ చెప్పిన ఈషా!