Lust Stories: తమన్నా, మృణాల్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’.. టీజర్‌ చూశారా!

2018లో విడుదలై సంచలనం సృష్టించిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ (Lust Stories) వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌ రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

Published : 06 Jun 2023 17:29 IST

హైదరాబాద్‌: 2018లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌ సిరీస్‌.. ‘లస్ట్‌ స్టోరీస్‌’. దానికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ ఈ నెల29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. తాజాగా ఈ సీజన్‌2కు సంబంధించిన టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. మొదటి భాగంలో కియారా అడ్వాణీ, భూమి పెడ్నేకర్‌ (Bhumi Pednekar), రాధిక ఆప్టే, మనీషా కోయిరాలా నటించగా రెండో భాగంలో తమన్నా (Tamannaah), మృణాల్‌, కాజోల్‌ (Kajol) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక టీజర్‌ మొదటి డైలాగుతోనే సిరీస్‌ ఎలా ఉంటుందో మేకర్స్‌ చెప్పేశారు. నిత్యం వార్తల్లో నిలిచే విజయ్‌ వర్మ (Vijay Verma) ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌ జూన్‌ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్‌ కానుంది. 4 స్టోరీలతో రానున్న ఈ సిరీస్‌ను నలుగురు దర్శకులు తెరకెక్కించారు. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ, కొంకణా సేన్‌ శర్మ, R.బాల్కి, సుజోయ్‌ ఘోష్‌లు దీన్ని రూపొందిస్తున్నారు. టీజర్‌ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన మేకర్స్‌ దీని రెండో భాగం మొదటి దానిని మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని