Cinema News: కొత్త ప్రయాణం

గీత రచయితగా సుపరిచితం తైదలబాపు. ‘6 టీన్స్‌’ మొదలుకొని 230కిపైగా సినిమాలకి ఆయన పాటలు రాశారు. ఇకపై గీత రచనని కొనసాగిస్తూనే సినీ నిర్మాణంలోకి అడుగు పెడుతున్నట్టు వెల్లడించారు.

Updated : 25 Apr 2022 08:46 IST

గీత రచయితగా సుపరిచితం తైదలబాపు. ‘6 టీన్స్‌’ మొదలుకొని 230కిపైగా సినిమాలకి ఆయన పాటలు రాశారు. ఇకపై గీత రచనని కొనసాగిస్తూనే సినీ నిర్మాణంలోకి అడుగు పెడుతున్నట్టు వెల్లడించారు. సోమవారం తైదలబాపు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరూ సమాజం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. నా పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లాలో 2022 మొక్కలు నాటుతున్నాం. ఇకపై మరిన్ని పాటలతో పాటు, మంచి చిత్రాల్ని  నిర్మిస్తాన’’ని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని