M M Keeravani: మహేశ్‌- రాజమౌళి ప్రాజెక్టు.. అప్పుడే పని మొదలెడతా: కీరవాణి

మహేశ్‌ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న #SSMB29కి సంబంధించి సంగీత దర్శకుడు కీరవాణి అప్‌డేట్‌ ఇచ్చారు.

Published : 23 Jun 2024 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మహేశ్‌ బాబు (Mahesh Babu)- రాజమౌళి (Rajamouli)ల చిత్రం #SSMB29 (వర్కింగ్‌ టైటిల్‌) ఎప్పుడు ప్రారంభమవుతుందోనని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా అది వైరల్‌గా మారుతోంది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి (M M Keeravani) తాజాగా ఇచ్చిన అప్‌డేట్ సైతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయన ఏం చెప్పారంటే?

పవన్‌ కల్యాణ్‌ ఫ్యామిలీ పిక్‌

‘‘నేనిప్పటి వరకూ ఈ సినిమా సంగీత పనులు ప్రారంభించలేదు. ఎందుకంటే ఈ వారమే స్టోరీ లాక్‌ అయింది. టెస్ట్‌ షూట్స్‌ జరుగుతున్నాయి. జులై/ ఆగస్టులో మ్యూజిక్‌ వర్క్‌ స్టార్ట్‌ చేస్తా’’ అని తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ విశేషాలు పంచుకున్నారు. మహేశ్‌, రాజమౌళి కలిసి పనిచేస్తున్నారనే విషయం తెలిసిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు నమోదయ్యాయి. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ కావడం, అందులో మహేశ్‌ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపిస్తారనే అప్‌డేట్‌తో మరింత ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని