Cinema News: నక్సల్‌ నేపథ్యం..

రఘు కుంచే ప్రధాన పాత్రలో పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్‌’. చదలవాడ శ్రీనివాసరావు నిర్మాత. అజయ్‌, సుబ్బరాజు, ఎల్‌.బి.శ్రీరామ్‌, కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ

Updated : 30 Jun 2022 08:04 IST

రఘుకుంచే (raghu Kunche) ప్రధాన పాత్రలో పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్‌’(Maa Naanna Naxalite). చదలవాడ శ్రీనివాసరావు నిర్మాత. అజయ్‌, సుబ్బరాజు, ఎల్‌.బి.శ్రీరామ్‌, కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘నక్సల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తండ్రీ కొడుకుల కథ ఇది. ఇందులో కొండరుద్ర సీతారామయ్య అనే నక్సల్‌ నాయకుడిగా రఘు కుంచే కనిపిస్తారు. కొడుకు కోసం పరితపించే తండ్రిగా ఆయన చాలా సహజంగా నటించారు. ఓ తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘చక్కటి వాణిజ్య హంగులతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ సినిమా రూపొందించాం. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ ప్రతి ఒక్కరి మదినీ తాకుతుంది. ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు నిర్మాత. సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి, ఛాయాగ్రహణం: ఎస్‌.వి.శివరామ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని