Maa Neella Tank: వెబ్‌ సిరీస్‌తో సుశాంత్‌.. ‘మా నీళ్ల ట్యాంక్‌’ టీజర్‌ చూశారా!

‘కాళిదాసు’, ‘కరెంట్‌’, ‘చి.ల.సౌ’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ తదితర చిత్రాలతో ఆకట్టుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌. ఆయన నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘మా నీళ్ల ట్యాంక్‌’.

Published : 27 Jun 2022 22:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కాళిదాసు’, ‘కరెంట్‌’, ‘చి.ల.సౌ’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ తదితర చిత్రాలతో ఆకట్టుకున్న అక్కినేని హీరో సుశాంత్‌ (Sushant). ఆయన నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘మా నీళ్ల ట్యాంక్‌’ (Maa Neella Tank). లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఓటీటీ ‘జీ 5’లో జులై 15 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ విడుదలైంది. రాయలసీమలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందినట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఓ వ్యక్తి నీళ్ల ట్యాంకు పైకెక్కడం, పోలీసు అధికారిగా సుశాంత్‌ ఆయన్ను కిందికి దింపే ప్రయత్నం చేయడం తదితర సన్నివేశాలతో టీజర్‌ సరదాగా సాగింది. సునీల్‌ కశ్యప్‌ అందించిన నేపథ్యం సంగీతం వినసొంపుగా ఉంది. ఈ సిరిస్‌లో సుశాంత్‌ సరసన ప్రియా ఆనంద్‌ నటించింది. ఈ ఇద్దరి లుక్స్‌, హావభావాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు