Thank You: ‘సై అంటే సైరా’.. స్ఫూర్తినిచ్చేలా నాగచైతన్య ‘థ్యాంక్‌ యూ’ గీతం

నాగచైతన్య హీరోగా  తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘థ్యాంక్‌ యూ’. ఈ సినిమాని జులై 8న విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది.

Published : 10 Jun 2022 19:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగచైతన్య హీరోగా  తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘థ్యాంక్‌ యూ’. ఈ సినిమాను జులై 8న విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్‌ను విడుదల చేయగా.. తాజాగా ఓ పాటను పంచుకుంది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ గీతం స్ఫూర్తినిచ్చేలా ఉంది. ఆట కూడా ఓ యుద్ధంలాంటిదే తాడో పేడో తేల్చుకోవాలనేది ఈ గీతం ఇతివృత్తం. విశ్వ, కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటను దీపు, పృథ్వీచంద్ర ఆలపించారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో చైతన్య సరసన రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవిక నాయర్‌ నటించారు. ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. సూపర్‌హిట్‌ చిత్రం ‘మనం’ తర్వాత విక్రమ్‌- చైతన్య కాంబినేషన్‌లో వస్తుండటంతో ‘థ్యాంక్‌ యూ’ (Thank You)పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని