Maayon: థ్రిల్‌ చేసే ‘మాయోన్‌’

ప్రముఖ నటుడు సత్యరాజ్‌ తనయుడు శిబిరాజ్‌ కథానాయకుడిగా కిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మాయోన్‌’. అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు నిర్మాత మామిడాల శ్రీనివాస్‌. ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుకని నిర్వహించారు. ర

Updated : 03 Jul 2022 07:05 IST

ప్రముఖ నటుడు సత్యరాజ్‌(Sathyaraj) తనయుడు శిబిరాజ్‌ (Sibi Sathyaraj) కథానాయకుడిగా కిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మాయోన్‌’(Maayon). అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు నిర్మాత మామిడాల శ్రీనివాస్‌. ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుకని నిర్వహించారు. రచయిత విజయేంద్రప్రసాద్‌, నటుడు సత్య ప్రకాశ్‌, నిర్మాతలు టి.ప్రసన్నకుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తిరుపతి రెడ్డితోపాటు, రేణుక తదితరులు హాజరయ్యారు. రచయిత విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘సత్యరాజ్‌కీ నాకూ ఏదో రుణానుబంధం ఉంది. అందుకే నేను రాసిన ‘బాహుబలి’ కథలో కట్టప్పగా ఆయన నటించారు. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మాయోన్‌’ కోసం కథానాయకుడు, దర్శకనిర్మాతలు ఎంతో ఇష్టంతో కష్టపడ్డారు.   తప్పకుండా విజయవంతం అవుతుంద’’’న్నారు. ‘‘ఓటీటీలో విడుదల కోసం మంచి ఆఫర్లు వచ్చినా విజువల్‌గా ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతిని పంచాలని థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మైథాలజీ, మిస్టరీల మేళవింపుగా సాగే ఈ సినిమా అందరినీ థ్రిల్‌ చేస్తుంది. ఇలాంటి కథలు అందరికీ చేరువ కావాల’’న్నారు చిత్ర దర్శకుడు. ఈ కార్యక్రమంలో శిబిరాజ్‌, సత్యరాజ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని